బుధవారం, సెప్టెంబర్ 28, 2005

హిందూ మరియూ గ్రీకు పురాణాల మధ్య సారూప్యతలు

నాకు చిన్ననాటి నుండీ కథలంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టం తోనే హిందూ పురాణాలలోని చాలా కథలు తెలుసుకున్నాను.
అలాగే 6వ తరగతి లో "ట్రోజన్ వార్" అనే నాన్డిటైల్డ్ చదివి గ్రీకు కథలూ తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచుకున్నాను.
అలా నేను అవకాశం దొరికినప్పుడు గ్రీకు కథలను తెలుసుకుంటున్నాను.
అలా గ్రీకు కథలను తెలుసుకుంటూ హిందూ పురాణాలలోని కథలతో పొల్చి చూస్తే చాలా సామ్యములు కనిపించాయి.
నేను తెలుసుకున్న ఈ సారూప్యతలను నేను రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
చివరిగా ఒక మాట.
ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ కించపరచటానికో లేక వారి అభిప్రాయాలను దెబ్బ తీయటానికో ఉద్ధేశ్యించబడినవి కావు.
ప్రమాదవశాత్తూ అలా జరిగితే క్షంతవ్యుడిని
సతీష్.

గురువారం, సెప్టెంబర్ 22, 2005

తరునమ్ ఖాన్ కి అంకితం

Tarunam khan

రేకులు విచ్చిన లేత సోయగమా
వెన్నెలకే కందిపోవు నవయవ్వనమా
కన్నులలో దాచితివేమది నీలి సంద్రమా
నీ లలాటమే విశాల గగనమా
నా ప్రేమను తెలుపుటకు ఇదే మంచి తరుణమా
ఓ తరునమా!
నా మొరాలించి కాస్త కరుణ చూపుమా

బుధవారం, సెప్టెంబర్ 21, 2005

భగీరధ ప్రయత్నం

భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు.
ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు.
ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను

ఆదివారం, సెప్టెంబర్ 18, 2005

ప్రయత్నం

ఎవరైనా ఏదైనా సాధించాలంటే కావలసింది ప్రయత్నం.
మన పురాణాలలో కూడ ప్రయత్నానికి సంబంధించి చాల దృష్టాంతాలున్నాయి.
కానీ మనకు ప్రయత్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భగీరధుడు.
ఎవరైనా చాలా ప్రయత్నించి (అపజయాలను కూడ లెక్క చేయకుండా ) ఏదైనా సాదిస్తే వారు భగీరధ ప్రయత్నం చేసారనో లేక భగీరదుడి లా కష్టపడ్డాడనో అనటం సర్వ సాధారణం
.కానీ మన పురాణాలలో ఎంతో ప్రయత్నించి అపజయాలను కూడ లెక్క చేయకుండా అనుకున్నది సాధించిన వారు ఇంకొంత మంది ఉన్నారు.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు విశ్వామిత్రుడు మరియూ ధ్రువుడు.
ఈ ముగ్గురూ ఎంత కష్టపడి తాము అన్నుకున్నది సాధించారో సవివరంగా రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.

శనివారం, సెప్టెంబర్ 17, 2005

పుష్ప విలాపం

నేను ప్రియురాలి సిగలోన ప్రియుని కాన్కగ మెరసి
ప్రేయసీ ప్రియుల నలరించినాను
నేను భగవత్పాదముల పై పునీతనై
తద్బహుమతిగా గ్రహింపబడినాను
ఇల్లాలి జడలోన పరిమళమై గుబాళించి
పతి అలసట పోగొట్టినాను.
నేడు దేవుని చేరిన వాని మెడలోన అలంకరింపబడి
అంటరాని దాననై చెత్త లో పడి ఉన్నాను

శుక్రవారం, సెప్టెంబర్ 16, 2005

అజ్ఞాత వీరుడి ఆత్మ ఘోష

నేనూ ఒక స్వాతంత్ర్య యోధుడిని
కానీ మహాత్ముడంత గౌరవం దక్కలేదు
దేశ మాత దాస్యశృంఖలాలను చేధించటానికి అహరహం శ్రమించాను
కానీ నేతాజీ అంత పలుకుబడి రాలేదు
ఎన్నో విప్లవ గీతాలకు పల్లవినయ్యాను
కానీ భగత్ సింగ్ అంత ఖ్యాతి రాలేదు
దేశ సేవ కోసం సర్వస్వం అర్పించాను
కానీ నెహ్రూలా ప్రధానిని కాలేదు
ప్రజలను విద్యావంతులనూ,చైతన్యవంతులనూ చేసాను
కానీ రామ్మోహన్ రాయ్ అంత సంస్కర్తగా పేరు రాలేదు
నేనూ కొందరు ఆంగ్లేయులను అంతమొందించాను
కానీ ఊధం సింగ్ లా నా పేరు మీద ఊళ్ళు లేవు
నేనూ దేశమాతను కీర్తిస్తూ ఎన్నో గీతాలు రాశాను
కానీ ఠాగూర్ లా విశ్వ కవిని కాలేదు
దేశం కోసం ప్రాణాలను కూడ అర్పించాను
అందుకే అజ్ఞాతంగా మిగిలిపోయాను.