Friday, December 18, 2009

కాళిదాసు గురించి - 2: భోజనం దేహి రాజేంద్రా!

కాళిదాసు గురించిన ఈ కథ బాగా ప్రచారం లో ఉంది.
భొజ రాజు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాళిదాసు ఆయన ఆస్థానంలో ఉండేవాడు. ఆ రాజ్యంలోనే ఒక పల్లెలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి రోజు గడవటమే కష్టంగా ఉండేది.

Wednesday, December 16, 2009

బ్రౌజర్ల పై చెణుకులు

ఈ రోజు అంతర్జాలంలో గమ్యం లేని బాటసారిలా విహరిస్తుంటే ఇది చూసాను. నేనైతే గట్టిగా నవ్వుకున్నాను.
మీరు కూడా హాయిగా నవ్వుకోండి.
ఇక్కడ  ఇంకా ఇక్కడ నొక్కండి

Tuesday, December 15, 2009

కాళిదాసు గురించి -1 : కోహం రండే?

కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.   ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే ఆయన గురించి చెప్పేటప్పుడు   "ఉపమా కాళిదాసః" అంటారు.
కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు.