tag:blogger.com,1999:blog-16764137.post-1129817490938962272005-10-20T07:09:00.000-07:002008-03-31T04:31:57.719-07:00విరివనంలో నా చెలిఒకనాడు నా చెలియ విరివనం లో అడుగిడగా

నేలయడిగె ఆమె పదకోమలత్వము
సంపెంగలడిగె ఆమె మేని పరిమళము
గులాబీలడిగె ఆమె అధరాల వర్ణము
సిరిమల్లెలడిగె ఆమె పలువరుస చందము
గండు కోయిలలడిగె ఆమె కంఠ మాధుర్యము
రాచిలకలడిగె ఆమె పలుకు లాలిత్యము
మకరందములడిగె ఆమె అధర సుధారస మాధుర్యము
సుమబాలలడిగె ఆమె సౌకుమార్యము
సుమములన్నియునడిగె ఆమె కురులందు స్థానము

అన్నియూనడిగె ఆమె అంతటి అందము
మరుజన్మలోనైన ఆమె వంటి రూపము

ఈ కవితకు నేను వ్రాసిన చివరి రెండు ముగింపు పాదాలు నాకు సరైనవిగా అనిపించలేదు.అందుకే ఆ రెండు పాదాలనూ కొద్దిగా దూరంగా వ్రాసాను.
ఎవరైనా ఒక మంచి ముగింపును సూచిస్తే తప్పక దానిని ఈ కవితకు జతపరుస్తాను
భానుభానుhttp://www.blogger.com/profile/02050833231154642667noreply@blogger.com