విరివనంలో నా చెలి

వ్రాసినది: భాను | వర్గములు:

ఒకనాడు నా చెలియ విరివనం లో అడుగిడగా

నేలయడిగె ఆమె పదకోమలత్వము
సంపెంగలడిగె ఆమె మేని పరిమళము
గులాబీలడిగె ఆమె అధరాల వర్ణము
సిరిమల్లెలడిగె ఆమె పలువరుస చందము
గండు కోయిలలడిగె ఆమె కంఠ మాధుర్యము
రాచిలకలడిగె ఆమె పలుకు లాలిత్యము
మకరందములడిగె ఆమె అధర సుధారస మాధుర్యము
సుమబాలలడిగె ఆమె సౌకుమార్యము
సుమములన్నియునడిగె ఆమె కురులందు స్థానము

అన్నియూనడిగె ఆమె అంతటి అందము
మరుజన్మలోనైన ఆమె వంటి రూపము



ఈ కవితకు నేను వ్రాసిన చివరి రెండు ముగింపు పాదాలు నాకు సరైనవిగా అనిపించలేదు.అందుకే ఆ రెండు పాదాలనూ కొద్దిగా దూరంగా వ్రాసాను.
ఎవరైనా ఒక మంచి ముగింపును సూచిస్తే తప్పక దానిని ఈ కవితకు జతపరుస్తాను
భాను

"విరివనంలో నా చెలి" కు 4 వ్యాఖ్యలు చెయ్యబడ్డాయి

  1. gravatar asankhya Says:

    adhbutam ga rasaru....sathish kumar gaaru...

    marinni manchi kavitalu vrayandi..

    -soma

  2. gravatar ramki Says:

    వారి ప్రశ్నలకు తనసమాధానము
    అయినది,మందస్మితము

    వారికి కాన రాగ రహస్యము
    తన కళ్ళలొ నిరాడంబరము.

  3. gravatar ramki Says:

    hai i am ramakrishna. i have given my idea of ending to your kavita. just check it.

  4. gravatar My Sweet Memories Says:

    Hi bhanu

    Here i have given my idea see this anneu adege ame anthuchikkani andamu e janmaku dorikena etuvanti rupam