శుక్రవారం, సెప్టెంబర్ 16, 2005

అజ్ఞాత వీరుడి ఆత్మ ఘోష

నేనూ ఒక స్వాతంత్ర్య యోధుడిని
కానీ మహాత్ముడంత గౌరవం దక్కలేదు
దేశ మాత దాస్యశృంఖలాలను చేధించటానికి అహరహం శ్రమించాను
కానీ నేతాజీ అంత పలుకుబడి రాలేదు
ఎన్నో విప్లవ గీతాలకు పల్లవినయ్యాను
కానీ భగత్ సింగ్ అంత ఖ్యాతి రాలేదు
దేశ సేవ కోసం సర్వస్వం అర్పించాను
కానీ నెహ్రూలా ప్రధానిని కాలేదు
ప్రజలను విద్యావంతులనూ,చైతన్యవంతులనూ చేసాను
కానీ రామ్మోహన్ రాయ్ అంత సంస్కర్తగా పేరు రాలేదు
నేనూ కొందరు ఆంగ్లేయులను అంతమొందించాను
కానీ ఊధం సింగ్ లా నా పేరు మీద ఊళ్ళు లేవు
నేనూ దేశమాతను కీర్తిస్తూ ఎన్నో గీతాలు రాశాను
కానీ ఠాగూర్ లా విశ్వ కవిని కాలేదు
దేశం కోసం ప్రాణాలను కూడ అర్పించాను
అందుకే అజ్ఞాతంగా మిగిలిపోయాను.

2 కామెంట్‌లు:

భాను చెప్పారు...

ఈ కవిత నేనే వ్రాశాను. భాను నా కలం పేరు.
ఎవరినీ కించపరచాలని కానీ విమర్శించాలని కానీ నా ఉద్దేశ్యం కాదు.
ఇది ఎవరినైనా కించపరిచేలా ఉంటే క్షంతవ్యుడిని.

anveshi చెప్పారు...

satish garu
very good one.i liked it.keep them coming.