శనివారం, సెప్టెంబర్ 17, 2005

పుష్ప విలాపం

నేను ప్రియురాలి సిగలోన ప్రియుని కాన్కగ మెరసి
ప్రేయసీ ప్రియుల నలరించినాను
నేను భగవత్పాదముల పై పునీతనై
తద్బహుమతిగా గ్రహింపబడినాను
ఇల్లాలి జడలోన పరిమళమై గుబాళించి
పతి అలసట పోగొట్టినాను.
నేడు దేవుని చేరిన వాని మెడలోన అలంకరింపబడి
అంటరాని దాననై చెత్త లో పడి ఉన్నాను

3 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

Damn cool blog,

I like ur telutu words for archives etc..

Vineeth Kurnala చెప్పారు...

Hi Satish

nee pushpa vilaapam bagundi kaani koncham incomplete ga vundi. Flowers happiness vyaktham chestoo sudden gaa topic maarchi grief loki vellinattu kaakunda inkaa smooth transition vasthe inka baguntundi. This is just my advice.
All the best.

.C చెప్పారు...

సతీశ్‌ గారూ,

నమస్తే! మీరు వ్రాసిన కవితలు భావపరంగా బాగానే ఉన్నాయి. కానీ, పైన వినీత్‌ చెప్పినట్టు flow సరిగ్గా లేదు. అలాగే, రెండవ కవిత prosaic గా సాగింది. అలా ఉండటంలో తప్పేమీ లేదు, కానీ కవితలో "సౌలభ్య"మే "కట్టె, కొట్టె, తెచ్చె" అన్నట్టు చెప్పగలగటం! దాన్ని సరైన విధంగా వాడుకుని అక్కరలేని పదాలు తగ్గించగలిగితే కవితకు ఇంకా చక్కని రూపం వస్తుంది. మీ కవితల్లో భావప్రకటన మాత్రం నిజంగా చాలా బాగుంది.

మీరు సహృదయంతో స్వీకరిస్తారనే ఉద్దేశంతో సూచనలు ఇచ్చాను. అన్యథా భావించరని తలుస్తాను.