బుధవారం, మార్చి 19, 2008

నేను చదివిన పుస్తకాలు

నాకు పుస్తకాలు చదవటం అంటే పిచ్చి, వెర్రి, ఇంక దాన్ని పోల్చటానికి ఎన్ని ఉపమానాలుంటే అన్నీనూ.
నా మిత్రులైతే నన్ను పుస్తకాల పురుగు అని ముద్దుగా పిలిచేవారు.
నేను ఇప్పటివరకూ చాలా పుస్తకాలు చదివాను
అందులో తెలుగు సాహిత్యానికి సంబందించినవి, గ్రీకుపురాణాలకు సంబందించినవీ ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఇక నుంచీ నేను చదివిన పుస్తకాలలోని విశేషాలు మీ అందరితో పంచుకుంటాను.


నేను ఈ సారి చెప్పబోతున్న పుస్తకం: హంసగీతం.
ఈ పుస్తకం గురించి చిన్న పరిచయం
ఇది వివిన మూర్తి గారి కలం నుండి జాలువారిన చారిత్రిక నవల. ఇతివౄత్తం శ్రీనాథ కవి సార్వభౌముని జీవిత చరిత్ర.ఇది "రచన" పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది.
ఆ నవల ఆవిష్కరణ సమయంలో "హిందూ" పత్రిక లో వచ్చిన ఈ సమీక్ష చూదండి.
http://www.hindu.com/br/2003/10/28/stories/2003102800030201.htm


దీని గురించి మరింత వివరంగా మరో ప్రచురనలో వివరిస్తాను.
చివరిగా ఒక చిన్న మాట.
ఇది నేనేదో ఆ పుస్తకానికి రాసే సమీక్ష కాదు.నాకు అంతటి పాండిత్యమూ లేదు, ఆ అర్హతా లేదు.
నేను పుస్తకాల్లో చదివి తెలుసుకున్న విషయాలని మీతో పంచుకోవాలని చేసే చిరు ప్రయత్నం మాత్రమే.


ఉంటాను...

3 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

భాను గారు బ్లాగుల ప్రపంచానికి స్వాగతం.మీ తదుపరి రచన కోసం ఎదురు చూస్తున్నాం.

కొత్త పాళీ చెప్పారు...

భానుగారూ, మరో సాహిత్య పిచ్చగాణ్ణి చూసి బోలెడూ సంతోషం వేసింది.
చదివిన చదువుతున్న పుస్తకాల గురించి .. సమగ్ర సమీక్షలు కాకపోయినా కనీసం మీ అభిపప్రాయాలని మాతో పంచుకోండి.
హంసగీతం చాలా కష్టపడి రాశానని మూర్తిగారే చెప్పుకున్నారు. కష్టం సంగతేమోగాని చాలా బాగా రాశారని నాకూ అనిపించింది.

RAMBABU చెప్పారు...

BHANU GARU,

NENU KUDA MEELANTI SAAHITYAABHILASHA UNNA VADINE. MEE AMULYAMAINA ABHIPRAYALU CHADUTUNTE ASALU PUSTAKAM CHADIVNANTA ANANDAM KALUGUTHONDI.
BEST WISHES