గురువారం, మే 17, 2012

వరదరాజ స్వామి

వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది.
స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి.

ఒక సందర్భంలో భగవద్రామానుజులని ఆయన స్నేహితులే కుట్ర చేసి చంపాలని చూస్తే ఈ వరద రాజ స్వామే మారు వేషంలో వచ్చి రక్షించాడని చెప్తారు.

 ఈ వరదరాజ స్వామి యజ్ఞగుండంలో ఉద్భవించాడు కాబట్టి ఆయనకు తాపం ఎక్కువట. అందుకే వరదరాజ స్వామి ప్రియ భక్తుడైన తిరుకచ్చినంబి ఆయనకు వింజామర సేవ ప్రారంభించారు.(తిరుకచ్చి నంబి వరదరాజ స్వామితో ముఖాముఖి మాటలాడగల మహా భక్తుడు. భగవద్రామానుజులు ’వార్తా షట్కము’ అనే ఆరు ప్రశ్నలకు సమాధానం ఈయన ద్వారానే వరదరాజ స్వామి ని అడిగి తెలుసుకున్నారు.) 
వరదరాజ స్వామి మూలమూర్తి - కంచి
ఇంతటి మహిమాన్వితమైన వరదరాజ స్వామి గురించి నేను వ్రాసిన ఒక పద్యం.
 
ఆ|| యజ్ఞగుండ మందు అవతరించిన వాడు
     యజ్ఞకర్త ఎంచ నజుడు కాగ
     కాంచిపురమునున్న ఘనుడు వరదరాజు 
     ధన్యమగును జన్మ తలచినంత.